బిగ్ బాస్ 8 నుంచి మరో ఎలిమినేషన్ జరిగింది. కిర్రాక్ సీత ఈ వారం ఇంటిని వదిలి బయటికి వచ్చేసింది. ఆమె ఎలిమినేట్ అయినట్లుగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం ఆరుగురు నామినేట్ అవగా.. అందులో నలుగురు సేఫ్ అయ్యారు. గంగవ్వ, పృథ్వీ, విష్ణు ప్రియ, యష్మీలు శనివారం సేఫ్ అయ్యారు. మిగిలిన ఇద్దరు కిర్రాక్ సీత, మెహబూబ్. అయితే మెహబూబ్ మెగా ఛీఫ్‌గా ఉన్న మెహబూబ్ సేఫ్ అవుతాడని శనివారమే అందరికీ తెలిసిపోయింది.
సండే ఎపిసోడ్‌లో అదే జరిగింది. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చినట్లుగా చెబుతూ.. ఈ వారం సీత ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించారు. ఇక ఆమెను స్టేజ్ మీదకి పిలిచి ఓ గేమ్ కూడా ఆడించారు. వైట్ హార్ట్, బ్లాక్ హార్ట్ అంటూ నాగ్ ఆడించిన ఈ గేమ్‌లో నిఖిల్, గౌతమ్, నైనికలకు బ్లాక్ హార్ట్ ఇచ్చిన సీత.. విష్ణు ప్రియ, నబీల్, అవినాష్‌కు వైట్ హార్ట్ ఇచ్చి.. వారి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పుకొచ్చింది.
ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో విశ్వం మూవీ ప్రమోషన్స్ జరిగాయి. గోపీచంద్, శ్రీను వైట్ల తమ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ స్టేజ్‌పై కాసేపు సందడి చేశారు. ఇక ఈ వారం చివరి నిమిషంలో సేఫ్ అయిన మెహబూబ్.. ఈ వారం ఎలిమినేట్ అయిన సీతకు.. హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత బైక్ కొనిస్తానని చెప్పడం హైలెట్‌గా నిలిచింది.