Advertisementt

నారా రోహిత్‌, సిరిల పెళ్లి ఎప్పుడంటే..

Sun 13th Oct 2024 11:51 PM
nara rohit,sireesha lella  నారా రోహిత్‌, సిరిల పెళ్లి ఎప్పుడంటే..
Nara Rohit Engaged His Love Sireesha Lella నారా రోహిత్‌, సిరిల పెళ్లి ఎప్పుడంటే..
Advertisement

హీరో నారా రోహిత్ నిశ్చితార్థం సిరి అలియాస్ శిరీషా లెల్లతో ఆదివారం హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్‌‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, బంధువులంతా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. నారా రోహిత్, సిరిల పెళ్లికి డిసెంబర్ 15ను పెద్దలు ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. ఈ డేట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం నారా రోహిత్, శిరీషా లెల్ల నిశ్చితార్థపు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలలో సాంప్రదాయ దుస్తులలో ఉన్న వీరిద్దరినీ చూసిన వారంతా చక్కని జంట అంటూ ప్రశంసిస్తున్నారు. నారా రోహిత్, సిరి కలిసి ప్రతినిధి 2 అనే చిత్రంలో నటించారు. ఆ సినిమా మొదలైనప్పటి నుంచే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవల పెద్దలకు విషయం చెప్పి.. పెళ్లి పీటల వరకు వెళ్లబోతున్నారు.

ప్రస్తుతం నారా రోహిత్ చేస్తున్న సుందరకాండ చిత్రం సెట్స్‌పై ఉండగా.. మరో రెండు మూడు ప్రాజెక్ట్‌లకు ఆయన ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని.. ఆ తర్వాత కమిటైన చిత్రాల షూటింగ్‌లో నారా రోహిత్ పాల్గొంటారని.. ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Nara Rohit Engaged His Love Sireesha Lella:

Nara Rohit and Sireesha Lella Marriage Date

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement