ఒక వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు.. రెండు రంగాల్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకెళుతున్నారు. పాలిటిక్స్ కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తిరిగి మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. రీసెంట్‌గా ఆయన హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి విజయదశమి స్పెషల్‌గా ఓ పోస్టర్‌ని వదిలారు.. అది అరాచకం అంతే.
అరాచకం అని ఎందుకూ అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆయనని ఇలా చూడాలని అనుకుంటున్నారు. ఇలాంటి ఒక సినిమా పడితే బాగుండు అని కలలు కన్నారు. ఆ కలలన్నీ నిజమవుతున్నాయి. హరిహర వీరమల్లులో మొదటిసారి చారిత్రాత్మక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్‌ను మళ్లీ వెండితెరపై చూసుకొని, థియేటర్లలో అసలుసిసలైన పండగ వాతావరణాన్ని తీసుకురావాలని.. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు మార్చి 28 సమాధానం చెప్పబోతోంది.
హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం 2025, మార్చి 28వ తేదీన భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. బ్యాలెన్స్ షూట్‌ని శరవేగంగా చిత్రీకరణ జరిపే పనిలో ఉన్నారు మేకర్స్. ఇక విజయదశమి స్పెషల్‌గా వచ్చిన ఈ పోస్టర్‌లో బాహుబలి సినిమాలో ప్రభాస్ చెప్పిన నద్వే మణిబంధం బహిర్ముకం తరహాలో పవన్ కళ్యాణ్ ఇందులో విల్లుతో కనిపిస్తున్నారు. స్పెషల్ ఏమిటంటే.. ప్రభాస్ కుడి చేతితో ప్రదర్శించిన విద్యను.. పవర్ స్టార్ ఎడమ చేతితో ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది.