మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుండి ఎలాంటి అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బింబిసార దర్శకుడి నుండి వస్తోన్న ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. రాబోయే సంక్రాంతికి రిలీజ్ అని చెప్పారు కానీ.. ఆ స్లాట్‌ని గేమ్ చేంజర్‌కి ఇచ్చినట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో రిలీజ్ వాయిదాపై ఫ్యాన్స్ ఎక్కడ డిజప్పాయింట్ అవుతారో అని చెప్పి.. ఎవరూ ఊహించని విధంగా విశ్వంభర టీజర్ వదిలారు మేకర్స్.
ఈ టీజర్ చూస్తుంటే మేకర్స్ చెప్పినట్లుగానే మరో ప్రపంచంలోకి తీసుకెళుతోంది. విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు.. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది అంటూ.. అవతార్ రేంజ్‌లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌లో టీజర్ మొదలైంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకొస్తుంది అనే వాయిస్ తర్వాత ఓ పాపతో మిత్రా.. యుద్ధం వస్తుందని అన్నావుగా.. ఎలా ఉంటుంది ఆ యుద్ధం అని చెప్పించి.. మెగాస్టార్‌ను అద్భుతమైన రీతిలో రివీల్ చేశారు. ఊచకోత ఎలా ఉంటుందనేదానికి ఉదాహరణగా మెగాస్టార్ కోత కోస్తుంటే.. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డివోషన్ మైండ్‌ని ఆక్రమించేలా చేస్తోంది. ఓవరాల్‌గా అయితే.. విశ్వం ఆశ్చర్యపడేలా ఈ సినిమాలో విషయం ఉండబోతుందనేది తెలియజేయడంలో.. ఈ టీజర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ నుంచి.. మళ్లీ అలాంటి చిత్రం కోరుకుంటున్న వారందరీ కోసం ఈ సినిమా అన్నట్లుగా లాస్ట్‌లో హనుమాన్‌ని చూపించి.. మీ కోరిక తీర్చబోతున్నానంటూ దర్శకుడు వశిష్ఠ క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఫెస్టివల్‌కి మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ ట్రీట్‌తో ఫ్యాన్స్ అంతా హ్యాపీ. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.