Advertisementt

గేమ్ చేంజర్ సంక్రాంతికి.. అఫీషియల్

Sat 12th Oct 2024 06:25 PM
game changer,dil raju,ram charan,sankranthi  గేమ్ చేంజర్ సంక్రాంతికి.. అఫీషియల్
Game Changer Goes To Sankarnthi గేమ్ చేంజర్ సంక్రాంతికి.. అఫీషియల్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. ముందుగా ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..

గేమ్ చేంజర్‌ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ భావించాం. ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం. మూడేళ్లుగా గేమ్ చేంజర్ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న విశ్వంభ‌ర‌ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతికి వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అందువ‌ల్ల సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిగారిని, యువీ వారిని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి రావ‌టానికి వాళ్ల విశ్వంభ‌ర సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు విడుద‌ల చేయాల‌నుకున్నారు. నిజానికి విశ్వంభ‌ర సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో స‌హా పూర్త‌వుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు రిలీజ్ చేయ‌టానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు. గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం. రామ్ చ‌ర‌ణ్‌‌కి గ్లోబ‌ల్ స్టార్ అనే బ్రాండ్ ఏదైతే ప‌డిందో దాన్ని.. గ్లోబ‌ల్‌గా ఈ సినిమా విజ‌యం సాధించేలా ప్ర‌య‌త్నిస్తున్నాం. ఆ ప్ర‌య‌త్నం ఫలిస్తుంది. సంక్రాంతికి క‌లుద్దామని అన్నారు.

Game Changer Goes To Sankarnthi:

Game Changer Official Release Announcement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ