దేవర చిత్రం విడుదలైన రోజు దానికొచ్చిన టాక్ చూస్తే దేవర చిత్రాన్ని కొన్న బయ్యర్లు లాస్ అవుతారు అనుకున్నారు. మొదటి రోజు దేవర చిత్రానికి మంచి క్రేజ్ ఉండడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కలెక్షన్స్ తో మేకర్స్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. ఆ మొదటిరోజు కలెక్షన్స్ పోస్టర్ చూసి అది ఫేక్ అంటూ యాంటీ ఫాన్స్ మాట్లాడారు.
రెండో రోజు నుంచి దేవర టాక్ తో సంబంధం లేకుండా పికప్ అయ్యింది. దానితో 15రోజులు తిరక్కుండానే 500 కోట్ల క్లబ్బులో కాలు పెట్టింది. మొదటి వీకెండ్ కలెక్షన్స్ పోస్టర్స్ వేసిన మేకర్స్ తర్వాత ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పోస్టర్ వదిలారు. ఎప్పటికప్పుడు దేవర కలెక్షన్స్ పోస్టర్ చూసి ఫేక్.. దేవర కి అంత కలెక్షన్స్ రాలేదు అన్నారు.
తాజాగా దేవర కలెక్షన్స్ పై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నా దేవర చిత్రంతో, మిడ్నైట్ షోలో టాక్ ఏం వచ్చినా సినిమా బాగుంటే జనాలు చూస్తారు, మేము మొదటి రోజు కలెక్షన్స్ పోస్టర్ వేస్తె ఫేక్ అన్నారు. మాకు డబ్బులొచ్చాయి అన్నా మీరు నమ్మట్లేదు, ఇంకేం చెప్పాలి.
మేము కలెక్షన్స్ పోస్టర్స్ వదిలేది ఫ్యాన్స్ కోసం. వారు హ్యాపీ గా ఉంటే మేము హ్యాపీ.. అంటూ దేవర కలెక్షన్స్ పై నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.