కొద్దిరోజులుగా మనీలాండరింగ్ కేసు విషయంలో శిల్పాశెట్టి దంపతులు నలిగిపోతున్నారు. మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా నివాసముంటున్న ఇల్లు, అలాగే ఫామ్‌హౌస్‌ను ఈ నెల 13 తేదీలోగా ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా లు ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
2017లో జరిగిన గెయిన్ బిట్‌కాయన్ పోంజీ స్కీమ్ లో రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదు అయ్యింది. ఈ స్కామ్‌లో మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొన్నది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే అక్టోబర్ 13 కల్లా రాజ్ కుంద్రా ఆస్తులను జప్తు చెయ్యాలని ఈడీ కోర్టును కోరింది. కానీ శిల్ప శెట్టి జంట బాంబే హై కోర్టు ను ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ నోటీసులపై స్టే విధించింది. దానితో శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతులకు ఊరట లభించింది.