కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార-విగ్నేష్ శివన్ తరచూ క్యూట్ అండ్ రొమాంటిక్ ఫోజులతో సూపర్బ్ అనేలా కనిపిస్తూ అభిమానులను కనువిందు చేస్తూ ఉంటారు. జవాన్ తర్వాత నయనతార కోలీవడ్ మూవీస్ తో బిజీగా వున్నప్పటికీ ఆమెకు దొరికిన ఖాళీ సమయాన్ని భర్త, పిల్లల కోసం కేటాయిస్తుంది.
వెకేషన్స్ అంటూ ట్రిప్స్ వెయ్యడమే కాదు.. చెన్నై లోను తన కొడుకులు ఉయిర్-ఉలగం లతో టైమ్ స్పెండ్ చేస్తూ ఫోటొలకు ఫోజులిస్తారు. విగ్నేష్ శివన్ ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తున్న LIC మూవీ షూటింగ్ తో బిజీగా వున్నా ఫ్యామిలీకి మాత్రం టైమ్ కేటాయిస్తారు. తాజాగా నయనతార-విగ్నేష్ శివన్ లు తన్మయత్వంతొ ఉన్న ఫొటోస్ వదిలారు.
చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అయిన నయనతార రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించగా.. విగ్నేష్ శివన్ భార్య తల పక్కనే తల పెట్టి తనయత్వంలో మునిగిపోయాడు. ప్రస్తుతం నయనతార-విగ్నేష్ జంట లేటెస్ట్ పిక్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.