బిగ్ బాస్ సీజన్ 8 ఐదు వారాల ఆటను పూర్తి చేసుకుని ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ అయిన వైల్డ్ కార్డు ఎంట్రీస్ అలాగే హౌస్ లోని అసలు కంటెస్టెంట్స్ తో కలిసి కళకళలాడుతుంది. నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో లోపలికి వచ్చిన వారు హౌస్ లో ఉన్నవారి తప్పులను ఎత్తి చూపుతూ నామినేషన్ వేశారు.
అందులో హరితేజ దగ్గర నుంచి అవినాష్ వరకు యష్మి తప్పులను చూపించారు. పృథ్వీ, విష్ణు ప్రియా, సీత ల గేమ్ పై నామినేషన్ వేశారు. అంతేకాదు వైల్డ్ కార్డు నుంచి మెహబూబ్, గంగవ్వలు నామినేషన్స్ లో వెళ్లారు. అయితే గంగవ్వపై మరోసారి బుల్లితెర ప్రేక్షకులు ప్రేమ చూపిస్తూ ఓట్లు గుద్దేస్తున్నారు. గంగవ్వ ఓటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. మెహబూబ్ రెండో స్థానంలో ఓట్లు రాబడుతున్నాడు.
ఆ తర్వాత విష్ణు ప్రియా నాలుగో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో యష్మి తన ఓటింగ్ ను మెరుగుపరుచుకుంది. ఇక చివరిగా డేంజర్ జోన్ లో పృథ్వీ, సీతలు ఉన్నారు. మరి ఈ వారం ఆటను ఇంప్రూవ్ చేసుకున్న సీత సేవవుతుందా, లేదంటే కండ బలంతో గేమ్ లో గెలుస్తున్న పృథ్వీ గెలుస్తాడా అనేది చూడాలి.