వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక అంటే కేవలం 11 సీట్లకే పరిమితమయ్యాక.. కొంతమంది జగన్ ని నమ్ముకుని పార్టీలో కొనసాగుతుంటే మరికొందరు మాత్రం జగన్ కు అన్యాయం చేసి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అవడమే కాదు.. ఇప్పటికే చేరికలు జరిగిపోయాయి కూడా.
అందులో రాజ్యసభ కి రాజీనామా చేసి మరీ మోపిదేవి వెంకట రమణ అయితే టీడీపీ లో జాయిన్ అయ్యారు. దానితో కామ్ గా వున్న జగన్ ఈరోజు ఓ ప్రెస్ మీట్ లో మోపిదేవి వెంకటరమణ అన్న 2019 ఎన్నికల్లో గెలవకపోయినా(151 సీట్లలో 23 సీట్లు ఓడిపోతే.. అందులో మోపిదేవి అన్న కూడా ఉన్నాడు.) అయినప్పటికీ ఆయనకు ఎమ్యెల్సీ ఇచ్చినా.. అంతేకాదు నా కేబినేట్ లో ఆయనకు పదవి ఇచ్చాను.
ఆ తర్వాత ఎమ్యెల్సీ ని రద్దు చేద్దామని కూడా వాళ్ళ పదవులు ఎక్కడ పోతాయో అని ఆనాడు ఎమ్యెల్సీ రద్దు చెయ్యలేదు. ఆ తర్వాత రాజ్యసభకు పోతా అన్నాడు, పంపించాను. కానీ ఈరోజు నాకు అన్యాయం చేసాడు అంటూ జగన్ మోపిదేవి వెంకట రమణ విషయంలో మొదటిసారి రియాక్ట్ అయ్యారు.