నిన్న బుధవారం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య తో కలిసి మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని స్పెషల్ పూజలు నిర్వహించారు. సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తెగ హైలెట్ అయ్యారు. తిరుపతి లడ్డు కాంట్రవర్సీ లో ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేసారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఇంట్లోనే రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కారణం ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ తరచూ వైరల్ ఫీవర్ కి గురవుతున్నారు. గత పది రోజులుగా ఇటు అధికార పనులు, అటు సినిమా షూటింగ్స్ అంటూ హడావిడి పడుతున్న పవన్ ఇప్పుడు గొంతునొప్పితో బాధపడుతున్నారు.
అసలు రెస్ట్ లేకుండా డే అండ్ నైట్ పని చేస్తున్న పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడడంతో ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.