నందమూరి బాలకృష్ణ ఫిక్స్ అయ్యారా.. అంటే అవుననే మాటే వినిపిస్తుంది. మరి బాలయ్య దేనికి ఫిక్స్ అయ్యారో తెలియక తెగ ఆలోచిస్తున్నారేమో.. బాలయ్య దేనికి ఫిక్స్ అయ్యారంటే.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం NBK 109 ని సంక్రాంతి బరిలో నిలపాలని ఫిక్స్ అయ్యారట. నిర్మాత నాగవంశీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో NKB 109 ని జనవరి 12 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా పీలర్లు వదులుతున్నారు.
ఇప్పటికే NBK 109 లో బాలయ్య పవర్ ఫుల్ లుక్ మాత్రమే కాదు మార్చ్ లో విడుదల చేసిన గ్లిమ్ప్స్ అన్ని అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక దసరా కు NBK 109 టైటిల్ రివీల్ చెయ్యడమే కాదు.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనే టాక్ వినబడుతుంది.
విజయదశమి రేపే.. మరి NBK 109 నుంచి ఏ సర్ ప్రైజ్ అభిమానులకు అందుతుందో.. ప్రస్తుతం అయితే NBK 109 చిత్రం జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా విడుదల చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారనే మాట గట్టిగానే వినబడుతుంది. చూద్దాం ఆ డేట్ ఎప్పుడు రివీల్ చేస్తారో అనేది.