అక్కినేని నాగార్జున తన కుటుంబం విషయంలో కొండా సురేఖ చేసిన చెత్త కామెంట్స్ పై ఆయన పరువు ష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖ కేసు విషయంలో నాగార్జున వాంగ్మూలాన్ని, ఆయన మేనకోడలు సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.. నాగార్జున తమ ఫ్యామిలీ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరారు.
గురువారం ఈ కేసును విచారించిన కోర్టు మంత్రికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 23కు వాయిదా వేసింది. మరోవైపు మాజీ మినిస్టర్ కేటీఆర్ కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు. తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పిటిషన్ లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
మొన్న నాగార్జున కొండా సురేఖ విషయంలో నాంపల్లి కోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు ఇదే కేసులో కేటీఆర్ కొండా సురేఖ విషయంలో కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.