మహేష్ బాబు-రాజమౌళి కాంబో మూవీ అనౌన్సమెంట్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, పాన్ ఇండియా ప్రేక్షకులు, హాలీవుడ్ అభిమానులు సైతం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ లోనే రాజమౌళి-మహేష్ కాంబో మూవీ ప్రకటన రావాల్సి ఉంది. కానీ అక్టోబర్ అందులోను దసరా వచ్చేసింది.
కానీ ఇప్పటివరకు SSRMB పై ఎలాంటి వార్త లేకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఢీలాపడిపోయి ఉన్నారు. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు SSRMB ఎప్పుడు మొదలవుతుందో అనే అప్ డేట్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా SSMB29 చిత్రం జనవరి 2025లో స్టార్ట్ అవుతుందని తెలిపారు.
ముందు కాస్త ఢీలా పడినా ప్రస్తుతం బయటికొచ్చిన అప్ డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. SSRMB ను కొత్త సంవత్సరంలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.