కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నారా వారబ్బాయి నారా రోహిత్ రీసెంట్ గానే ప్రతినిధి 2 తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. TV 5 మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా నటించిన ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కింది. ఈ చిత్రం తర్వాత ఇమ్మీడియేట్ సుందరకాండ అనే చిత్రాన్ని నారా రోహిత్ మొదలు పెట్టేసాడు.
తాజాగా నారా రోహిత్ పెళ్లి పీటలెక్కబోతున్నాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకుగా మారిన నారా రోహిత్ ఇంతవరకు వివాహం చేసుకోలేదు. ఇప్పుడు సడన్ గా ఎంగేజ్మెంట్ కి సిద్దమవడమే కాదు.. హైదరాబాద్ లో ఈ నెల 13 న నారా రోహిత్ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది.
నారా రోహిత్ ఎంగేజ్మెంట్ కు ఏపీ సీఎం చంద్రబాబు సహా నందమూరి ఫ్యామిలీ సభ్యులు హాజరవుతారని తెలుస్తుంది. సీఎం సోదరుడు కొడుకు నిశ్చితార్ధం అంటే ఓ రేంజ్ లో ఉండడం ఖాయం. ప్రస్తుతం నారా రోహిత్ ఎంగేజ్మెంట్ న్యూస్ మాత్రం హాట్ హాట్ గా వైరల్ అయ్యింది.