యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో సెప్టెంబర్ 27 న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దేవర చిత్రం విడుదలకు ముందు ఓ వర్గం అభిమానులు దేవర పై కక్ష కట్టారు. అది దేవర ఓపెనింగ్స్ పై ప్రభావం పడకపోయినా.. మొదటి రోజు దేవర పై సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటి చూస్తే సినిమా డిసాస్టర్ అవ్వడం ఖాయమనుకున్నారు.
అటు యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ విమర్శకుల సైతం దేవర చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ టాక్ తో సినిమా ఎన్ని కలెక్షన్స్ నమోదు చేస్తుంది, ఎన్టీఆర్ దేవర తో అభిమానులు డిజప్పాయింట్ అవుతారు అనుకుంటే నిజంగా రెండో రోజు నుంచే దేవర కలెక్షన్స్ పెరగడం, రెండు వారాలు తిరక్కుండానే దేవర 500 కొట్ల క్లబ్బులో అడుగుపెట్టడం అన్ని చక చకా జరిగిపోయాయి.
అయితే థియేటర్స్ లో అంతలా హిట్ అవడానికి ఓ రకంగా కాదు పూర్తిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కారణమని చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర చిత్రాన్ని ఒకటికి ఐదు సార్లు థియేటర్స్ లో వీక్షించారు. దేవర 1 అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం అభిమానులే అనడం లో సందేహమే లేదు. అదే విషయం ఎన్టీఆర్ కూడా చెబుతున్నారు. దేవర పై అభిమానుల చూపించిన ప్రేమను, అభిమానాన్ని, రుణాన్ని ఎప్పటికి తీర్చుకోలేను అని అంటున్నారు.
దసరా సందర్భంగా ఎన్టీఆర్-కొరటాల సుమ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే ఎన్టీఆర్ తన అభిమానులు తనని కాపాడారు, దేవర చిత్రాన్ని గట్టెక్కించింది వారే, వారి ఋణం ఎప్పటికి తీర్చుకోలేను అంటూ ఎన్టీఆర్ చాలా గొప్పగా అభిమానులను పొగిడారు. ఎన్టీఆర్ అంత మెచ్యూర్డ్ గా మాట్లాడడం అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసింది.