ఏ భార్య అయినా తప్పు చేస్తుంది అంటే మంచి భర్త అయితే మందలించడమో.. లేదంటే మంచిగా చెప్పుకుని మార్చుకోవడమో చేస్తారు. అయినప్పటికి మాట వినని భార్య ఆ భర్త ని శిక్షించడానికి కూడా వెనకాడడు. ఇప్పడు ఇలాంటి భార్య-భర్తల కథే హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో వినిపించింది.
హైదరాబాద్ మణికొండ లోని మున్సిపల్ ఆఫీస్ లో డీఈఈ గా పని చేస్తున్న శివ జ్యోతి అవినీతికి కాదు కాదు లంచాలకు అలవాటు పడి ప్రతి రోజు ఇంటికి వచ్చేటప్పుడు లక్షలు లక్షలు తీసుకొచ్చి వాటిని ఇంట్లోని ప్రతి మూల దాచి పెట్టడం చూసిన భర్త శ్రీపాద్ భార్య ను మారమని ఏంతో నచ్చజెప్పాడు.
కానీ శివజ్యోతి మాత్రం భర్త శ్రీపాద్ మాటలను పట్టించుకోలేదు. ఫలితం భార్య అవినీతిని తట్టుకోలేక శ్రీపాద్ ఆమె ఇంట్లో ఎక్కడెక్కడ నోట్ల కట్టలు దాచిందో అవన్నీ వీడియో తీసి మరీ మీడియా కి పంపించి షాకిచ్చాడు. దానితో శివ జ్యోతి ఇంటికి పోలీసులు, అధికారులు వెళ్లగా ఆమె ఇంట్లో దాచిన డబ్బు చూసి షాకయ్యారు. ప్రస్తుతం శివ జ్యోతి ని అదుపులోకి తీసుకుని ఆమె అవినీతని అధికారులు ప్రశ్నిస్తున్నారు.