Advertisementt

సూపర్ స్టార్ సినిమా అంటే ఎట్లుండాలే..

Wed 09th Oct 2024 01:59 PM
vettaiyan  సూపర్ స్టార్ సినిమా అంటే ఎట్లుండాలే..
What is a Superstar movie? సూపర్ స్టార్ సినిమా అంటే ఎట్లుండాలే..
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ కి వరస వైఫల్యాలు ఉన్నపటికీ ఆయన సినిమా వస్తుంది అంటే ఆ క్రేజే వేరు. ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే కార్పొరేట్ కంపెనీలకు సెలవలు కూడా ఇచ్చేవారు. కానీ సూపర్ స్టార్ వరసగా బోలెడన్ని సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను డిజపాయింట్ చేసారు. 

అయినప్పటికీ జైలర్ చిత్రంతో రజినీకాంత్ కమ్ బ్యాక్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత సూపర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా వేట్టయ్యన్. ఈ దసరా సందర్భంగా విడుదల కాబోతున్న పెద్ద సినిమా వేట్టయ్యన్. దసరా సెలవలు సందర్భంగా అక్టోబర్ 10 అంటే రేపు గురువారం విడుదల కాబోతున్న వేట్టయ్యన్ మూవీపై టాలీవుడ్ లో అస్సలు క్రేజ్ కనిపించడం లేదు. 

ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా తెలుగు ప్రేక్షకుల ముందు వేట్టయ్యన్ రాబోతుంది. తమిళనాట ఆడియో లాంచ్ తో హైప్ క్రియేట్ చేసిన టీమ్ తెలుగు విషయం వచ్చేసరికి లైట్ తీసుకున్నారు. సూపర్ స్టార్ అంటే కాస్త అస్వస్థతతో ఉన్నారు. ఆయన రాలేరు. కానీ చిత్ర బృందం కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు. 

ఎటువంటి ప్రమోషన్స్ లేకపోవడంతో వేట్టయ్యన్ కి తెలుగులో ఏ మాత్రం బజ్ కనిపించడం లేదు. సినిమా టీజర్, ట్రైలర్ లు మరీ అంత ఎగ్జైటింగ్ గా ఆకట్టుకోకపోవడం, ప్రమోషన్స్ లేకపోవడంతో వేట్టయ్యన్ పై ఎలాంటి క్రేజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. అది చూసిన కామన్ ఆడియన్స్ మాత్రం సూపర్ స్టార్ సినిమాలంటే ఎట్లుండాలి.. కానీ ఇలా ఏమిటో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

What is a Superstar movie?:

Vettaiyan release tomorrow

Tags:   VETTAIYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ