Advertisementt

పేర్లు చెప్పకుండా పూనమ్ గేమ్

Wed 09th Oct 2024 12:00 PM
poonam kaur  పేర్లు చెప్పకుండా పూనమ్ గేమ్
Poonam Kaur Sensational tweet on Director పేర్లు చెప్పకుండా పూనమ్ గేమ్
Advertisement
Ads by CJ

పూనమ్ కౌర్ చాలాయేళ్ల నుంచి పేర్లు ప్రస్తావించకుండానే సోషల్ మీడియా వేదికగా చాలా ట్వీట్లు చేస్తుంది. కొన్నిసార్లు గురూజీ అంటూ త్రివిక్రమ్ ను ఇండైరెక్ట్ గా ఏసుకుంటున్న పూనమ్ కౌర్.. ఎక్కువగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లనే టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈమధ్యన మా అసోసిషియన్ లోత్రివిక్రం పై కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే తీసుకోలేదు అంటూ పూనమ్ కౌర్ సంచలనంగా మాట్లాడింది. 

తాజాగా పూనమ్ కౌర్ పేర్లు ప్రస్తావించకుండా షాకింగ్ ట్వీట్ వేసింది. ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఓ పంజాబీ అమ్మాయిని ప్ప్రెగ్నెంట్ చేసి ఆమె కెరీర్ ను నాశనం చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసిషియన్ జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త ఊరట లభించింది. అతను లీడర్ గా మారిన నటుడు కాదు. 

అయితే ఈ విషయంలోకి ఓ రాజకీయనాయకుడు, నటుడు అయినటువంటి వ్యక్తి ఆమెని అనవసరంగా లాగారు అంటూ పేర్లు ప్రస్తావించకుండా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. అది చూసిన నెటిజెన్స్ ఏమమ్మా పూనం పేర్లు చెప్పకుండా ఎన్నాళ్లీ దాగుడు మూతలంటూ కామెంట్ చేస్తున్నారు.  

Poonam Kaur Sensational tweet on Director:

Poonam Kaur tweet on Director

Tags:   POONAM KAUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ