Advertisementt

దేవర 2 మొదలయ్యేది అప్పుడే..!

Wed 09th Oct 2024 11:13 AM
devara 2  దేవర 2 మొదలయ్యేది అప్పుడే..!
Devara 2 starts then..! దేవర 2 మొదలయ్యేది అప్పుడే..!
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 27 న విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం మిక్స్డ్ టాక్ తోనే రెండు వారాల్లో 500 కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన దేవర చిత్రానికి ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు క్రిటిక్స్ నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ అభిమానుల నుంచి పాజిటివ్ గా మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో క్రమేణా కలెక్షన్స్ పెరిగి సినిమాని సక్సెస్ తీరానికి చేర్చింది. 

ఇక దేవర పార్ట్ 1 అర్దాంతరంగా కొరటాల ముగించి రెండో భాగానికి లీడిచ్చారు. అయితే దేవర పార్ట్ 1 క్లైమాక్స్ అభిమానులను కూడా డిజప్పాయింట్ చేసింది. అయినప్పటికీ ఇప్పుడు దేవర 1 కి భారీ కలెక్షన్స్ రావడంతో పార్ట్ పై అంచనాలు పెరగడము, దేవర 1 లో ఉన్న లోపాలు దేవర 2 లో రిపీట్ అవకుండా కొరటాల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. 

అయితే దేవర పార్ట్ 2 ఎప్పుడు మొదలవుతుందో అనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలయ్యింది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 షూటింగ్ తో పాటుగా జనవరి నుంచి ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి వెళ్లాల్సి ఉంది. ఇటు వార్ 2, అటు ప్రశాంత్ నీల్ మూవీస్ రెండు పూర్తయ్యాకే ఎన్టీఆర్ దేవర 2 సెట్స్ పైకి వెళ్తాడు, ఈలోపు కొరటాల ఒక సినిమా పూర్తి చేసి వస్తాడని తెలుస్తోంది. అప్పటివరకు దేవర 2 సెట్స్ పైకి వెళ్ళదు. 

Devara 2 starts then..!:

NTR Devara 2 Shooting Details Here

Tags:   DEVARA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ