Advertisementt

స్పిరిట్: ప్రభాస్ స్పెషల్ లుక్ లాక్?

Wed 09th Oct 2024 10:59 AM
prabhas  స్పిరిట్: ప్రభాస్ స్పెషల్ లుక్ లాక్?
Spirit: Prabhas special look lock? స్పిరిట్: ప్రభాస్ స్పెషల్ లుక్ లాక్?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మారోపక్క హను రాఘవుడి షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు కూడా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ లేకుండా హను రాఘవపూడి సెట్స్ పైకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ లేని సన్నివేశాలను ఆయన చిత్రీకస్తున్నారు. 

ఇక ఈ ఏడాది ప్రభాస్ యానిమల్ దర్శకుడు సందీప్ వంగ తో స్పిరిట్ మూవీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సందీప్ వంగ ఇప్పటికే స్పిరిట్ స్క్రిప్ట్ లాక్ చేసేసి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని సందీప్ వంగ ఎప్పుడో చెప్పారు. అయితే తాజాగా ప్రభాస్ పవర్ ఫుల్ స్పెషల్ లుక్ ని సందీప్ వంగ లాక్ చేసేసారు. 

రాజా సాబ్ లుక్ నుంచి ప్రభాస్ స్పిరిట్ లో సందీప్ వంగ డిజైన్ చేసిన లుక్ లోకి మారతారు, ఆ తరవాతే ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ లోకి వెళతారని తెలుస్తోంది. మరి సందీప్ వంగ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ లుక్ ని ఎంత డిఫ్రెంట్ గా డిజైన్ చేసారో అనే క్యూరియాసిటీ అయితే ప్రభాస్ అభిమానుల్లో మొదలైపోయింది. 

Spirit: Prabhas special look lock?:

Prabhas in an unexpected look for Spirit

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ