Advertisementt

సమంత కు టాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదా?

Wed 09th Oct 2024 10:11 AM
samantha  సమంత కు టాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదా?
Is Samantha not interested in Tollywood? సమంత కు టాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదా?
Advertisement
Ads by CJ

శాకుంతలం, ఖుషి సినిమాల తర్వాత షూటింగ్స్ కు బిగ్ బ్రేకిచ్చిన సమంత ఆ తర్వాత హెల్త్ ఇష్యుస్ తో కోలుకుని ఫైనల్ గా షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది. అయితే అది సౌత్ సినిమాల సెట్స్ కాదు, హిందీలో తెరకెక్కుతున్న వెబ్ సీరియస్ ల సెట్స్ లోకి. ప్రస్తుతం సమంత ఎక్కువగా హిందీ పైనే కాన్సంట్రేట్ చేసింది అనే వాదన. కాబట్టే ఆమె గ్లామర్ షో టూ మచ్ గా ఉంది అనే టాక్ లేకపోలేదు.  

అంతేకాదు సమంత హైదరాబాద్ లో కనిపించి చాలా రోజులైపోయింది. ఆమె తరచూ ముంబైలో దర్శనమిస్తుంది. అక్కడే ఆమె సెటిల్ అయ్యే ఆలోచనలో కనిపిస్తుంది. తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సమంత పై చేసిన కామెంట్స్ చూస్తే టాలీవుడ్ ను లైట్ తీసుకుందా అనేలా ఉన్నాయి. 

అలియా భట్ లేటెస్ట్ చిత్రం జిగ్రా ఈవెంట్ కి అలియా భట్ తో పాటుగా సమంత కూడా గెస్ట్ గా పాల్గొంది. అక్కడికి మరో గెస్ట్ గా వచ్చిన త్రివిక్రమ్ మట్లాడుతూ.. సమంత పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. స‌మంత గారూ మీరు ఎప్పుడూ ముంబైలోనే కాదు, అప్పుడ‌ప్పుడూ హైద‌రాబాద్ కి కూడా వ‌స్తుండండి.. మీరు ఇక్కడ సినిమాలు చేయ‌రేమో అని నేను క్యారెక్ట‌ర్లు రాయ‌డం లేదు అంటూ సమంతను ఉద్దేశించి త్రివిక్రం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Is Samantha not interested in Tollywood?:

Trivikram heaps praises on Samantha

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ