మెగా ఫ్యాన్స్ ను దర్శకుడు శంకర్ డిజప్పాయింట్ చెయ్యని రోజు లేదు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్ర రిలీజ్ డేట్ విషయంలో గత ఏడాది కాలంగా మెగా అభిమానులు ప్రతిసారి డిజప్పాయింట్ అవుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ విషయం పక్కనపెడితే మరోసారి మెగా ఫ్యాన్స్ ను నిరాశ పరిచే వార్త ను మోసుకొచ్చారు.
అది దసరా ఫెస్టివల్ సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి టీజర్ వదులుతారని అన్నారు. కానీ ఇప్పుడు దసరా సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ రావడం లేదని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చేసాడు. టీజర్ దసరా పండగకు రావట్లేదని డిజప్పాయింట్ కాకండి, టీజర్ కి ఇంకా సిజి వర్క్స్ డబ్బింగ్, ఫైనల్ ఎడిటింగ్ ఇంకా అవుతున్నాయి.
టీజర్ కి సంబందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ స్టార్ట్ చేసానని, అది అవ్వగానే టీజర్ డేట్ లాక్ చేస్తారని చెప్పిన థమన్ ఈ డిజప్పాయింట్ న్యూస్ తో పాటుగా మరో గుడ్ న్యూస్ కూడా వినిపించాడు. గేమ్ ఛేంజర్ 3వ సాంగ్ అక్టోబర్ 30నే విడుదల చేస్తున్నట్టు డేట్ అనౌన్స్ చేసేసాడు. అంతేకాదు గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20 కి విడుదల చేస్తున్నట్టుగా మళ్ళీ మళ్ళీ కన్ ఫర్మ్ చేసాడు థమన్.