నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చేసే సినిమాల లిస్ట్ చూస్తే ఆమె చేసినవన్నీ ప్రత్యేకమైన సినిమాలే. కథల ఎంపిక లో ఆమె మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. తన పాత్ర కు ప్రాధాన్యత లేనిదే సాయి పల్లవి సినిమా ఒప్పుకోదు. అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ కు ఉండే నిడివి పై సాయి పల్లవి కి స్పష్టమైన క్లారిటీ ఉంది.
అందుకే సాయి పల్లవి కమర్షియల్ సినిమాల వైపు చూడదు. రెండు పాటలు, హీరోతో రెండు మూడు రొమాంటిక్ సీన్స్ కి పరిమితమయ్యే కథలను సాయి పల్లవి పట్టించుకోదు. ఇప్పుడు అమరన్ సినిమాలో సాయి పల్లవి నటించడం పట్ల చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అమరన్ సినిమా స్క్రిప్ట్ నచ్చింది. కానీ నాకు పెద్ద హీరోల సినిమాల్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్క్రిప్ట్ కి అవసరాన్ని బట్టి మిగతా సీన్స్ కట్ చేస్తారనుకున్నాను.
ఆ అనుమానంతోనే దర్శకుడిని అడిగాను. దర్శకుడు ఇచ్చిన నేరేషన్ చూసాక అలాంటి పాత్రను వదులుకోకూడదు అనుకున్నాను. ఎంతో లక్కు ఉంటేనే కానీ ఇలాంటి పాత్రలు రావు అంటూ సాయి పల్లవి అటు అమరన్, ఇటు కమర్షియల్ సినిమాలపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.