నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బిజీయెస్ట్ హీరోయిన్. వరస సినిమాలతో నార్త్ సౌత్ అంటూ పరుగులు పెడుతుంది. రీసెంట్ గానే చిన్న యాక్సిడెంట్ తో కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ బిజీ అయిన రష్మిక మందన్న అటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ అయ్యింది. యాక్సిడెంట్ తో సోషల్ మీడియాకు కూడా బ్రేకిచ్చింది.
యాక్సిడెంట్ నుంచి కోలుకుని పనిలోకి దిగిపోయిన రష్మిక మందన్న సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ అయ్యింది. తరచూ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఎప్పటిలాగే హడావిడి మొదలు పెట్టింది. షూటింగ్స్ తో ఎంతగా బిజీగా వున్నప్పటికీ స్పెషల్ ఫోటో షూట్స్ పై బాగా కాన్సంట్రేట్ చేస్తుంది ఈ బ్యూటీ.
తాజాగా రష్మిక వదిలిన ఫొటోస్ చూస్తే బ్యూటిఫుల్ అనకుండా ఉండలేరేమో.. మోడ్రెన్ చుడిదార్ లో లూజ్ హెయిర్ తో సింపుల్ గా కనిపించినప్పటికీ రష్మిక మాత్రం బ్యూటిఫుల్ గా అదరగొట్టేసింది. నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వదిలిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో కాదు స్టార్ హీరోల తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ రష్మిక యమా జోరు చూపిస్తుంది.