అక్కినేని నాగార్జున తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసాడు. తన ఫ్యామిలీ పై కొండా సురేఖ పై చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాంపల్లి కోర్టులో నాగార్జున-కొండా సురేఖ కేసు విచారణలో అది. కోర్టు నాగార్జున, ఇంకా కొంతమంది సాక్ష్యులు వాంగ్మూలాన్ని రికార్డ్ చెయ్యాలని కోర్ట్ చెప్పింది.
దానితో ఈ రోజు నాగార్జున తన నాగ చైతన్య, అమల తో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు నాగార్జున వాంగ్మూలం రికార్డు చేసింది. అలాగే నాగార్జున మేనకోడలు సుస్మిత వాంగ్మూలం కూడా రికార్డు చేసింది. అక్కినేని ఫ్యామిలీ పట్ల దేశంలో ఒక గౌరవం ఉందని, తమకు కుటుంబానికి ఎన్నో అవార్డులు వచ్చాయని తన కోడలు-కొడుకు విడిపోవడానికి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
అందుకే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్ట్ ను కోరారు. నాంపల్లి కోర్టు నాగార్జున పిటిషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.