Advertisementt

వంశీ పైడిపల్లికి బాలీవుడ్ స్టార్ హీరో దొరికాడు

Tue 08th Oct 2024 04:49 PM
vamsi paidipally  వంశీ పైడిపల్లికి బాలీవుడ్ స్టార్ హీరో దొరికాడు
Vamsi Paidipally has found a Bollywood star hero వంశీ పైడిపల్లికి బాలీవుడ్ స్టార్ హీరో దొరికాడు
Advertisement
Ads by CJ

వారసుడు తర్వాత వంశి పైడిపల్లికి ఇప్పటి వరకు హీరో దొరకలేదు. విజయ్ తో తెరకెక్కించిన వారసుడు చిత్రం సీరియల్ లా ఉంది అనే కామెంట్స్ తో వంశి పైడిపల్లితో సినిమాలు చెయ్యడానికి ఎవ్వరు ముందుకు రాలేదని మట్లాడుకున్నారు. వంశీ పైడిపల్లి కూడా కథను రెడీ గా ఉన్న వంశీ పైడిపల్లికి ఇప్పుడు ఓ క్రేజీ బాలీవుడ్ స్టార్ హీరో తగిలాడట. 

ప్రస్తుతం సౌత్, నార్త్ అనేది ఎక్కడా కనిపించకుండా పాన్ ఇండియా మార్కెట్ ను సెట్ చేస్తూ సౌత్ దర్శకులు నార్త్ లో, నార్త్ వాళ్ళు సౌత్ కి వచ్చేసి హీరోలతో కమిట్ అయ్యి సినిమాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ అయితే బాలీవుడ్ లో కాలు పెట్టి క్రేజీ దర్శకుడిగా అక్కడి హీరోలతో సినిమాలు చేస్తున్నట్టే ఇప్పుడు వంశి పైడిపల్లికి కూడా స్టార్ హీరో దొరికాడు. 

ఆయనే మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ తో చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. ఇంతకుముందే ర‌ణ‌వీర్ సింగ్, ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి యంగ్ హీరోల‌కు ట‌చ్ లోకి వెళ్లినా ప్రస్తుతం వంశీపైడిప‌ల్లి అమీర్ ఖాన్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు గా తెలుస్తోంది. మరి వంశీ పైడిపల్లి-అమీర్ ఖాన్ మధ్యన చర్చలు ఫలితం.. సౌత్ దర్శకుడు, బాలీవుడ్ హీరో సినిమా ఫిక్స్ అవుతుంది. 

Vamsi Paidipally has found a Bollywood star hero:

Telugu Director Gets Aamir Khan

Tags:   VAMSI PAIDIPALLY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ