Advertisementt

BB 8: ఓటింగ్ లో దూసుకుపోతున్న కంటెస్టెంట్

Tue 08th Oct 2024 02:08 PM
gangavva  BB 8: ఓటింగ్ లో దూసుకుపోతున్న కంటెస్టెంట్
BB 8: Contestant rising in voting BB 8: ఓటింగ్ లో దూసుకుపోతున్న కంటెస్టెంట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లోకి ప్రవేశించిన వైల్డ్ కార్డు ఎంట్రీస్ హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్, మెహబూబ్, అవినాష్, నయని, రోహిణి, గంగవ్వ వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. అయితే వీరిలో ఈ వారం నామినేషన్స్ లో గంగవ్వ, మెహబూబ్ లు డైరెక్ట్ గా నామినేషన్ లోకి వచ్చారు. అటు ఓల్డ్ కంటెస్టెంట్స్ లో పృథ్వీ, సీత, యష్మి, విష్ణు ప్రియాలు నామినేషన్ లో ఉన్నారు. గత అర్ధరాత్రి నుంచే ఓపెనయిన ఓటింగ్ లైన్స్ లో అప్పుడే గంగవ్వ భారీ ఓట్లను రాబడుతుంది. 

గతంలో గంగవ్వ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఏసీ లు పడక ఆమె ఆరోగ్యం పాడవడంతో మధ్యలోనే బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత గంగవ్వ ఇంకాస్తా ఫేమస్ అయ్యింది. నాగార్జున, అలాగే బిగ్ బాస్ మనీ తో సొంతిల్లు కట్టుకుని మనవళ్లను చదివించుకున్నట్టుగా చెప్పిన గంగవ్వకు బిగ్ బాస్ 8 లోకి మరోసారి ఛాన్స్ రావడంతో వదులుకోలేదు. పెద్దావిడ, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది అని గతంలోనే ఆమె నచ్చి బుల్లితెర ప్రేక్షకులు సపోర్ట్ చేసారు. 

ఈ సీజన్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయిన గంగవ్వ ను అప్పుడే బుల్లితెర ప్రేక్షకులు సేవ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. నిన్న సోమవారం గంగవ్వ నామినేషన్స్ లోకి రాగానే ఆమెకు ఆమె అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు భారీగా ఓట్లు గుద్దుతున్నారు. ఆతర్వాత స్థానాల్లో విష్ణుప్రియ, పృధ్వీ లు ఉన్నారు. నాలుగో స్థానంలో మెహబూబ్‌, ఐదో స్థానంలో యష్మీ, చివరి స్థానంలో కిరాక్ సీత ఉన్నారు. ఈ వారం యష్మి కానీ లేదంటే సీత కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 

BB 8: Contestant rising in voting:

BB 8: 6th week voting result

Tags:   GANGAVVA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ