Advertisementt

విడాకులు కావాలి కానీ కోర్టుకు హాజరవ్వరు

Tue 08th Oct 2024 12:13 PM
dhanush  విడాకులు కావాలి కానీ కోర్టుకు హాజరవ్వరు
Dhanush and Aishwarya fail to appear before the court విడాకులు కావాలి కానీ కోర్టుకు హాజరవ్వరు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్యతో 18 ఏళ్ళ సంసార జీవితానికి విడాకులతో ఎండ్ కార్డు వేసారు. రెండేళ్ల క్రితమే ధనుష్-ఐశ్వర్యలు విడిపోతున్నట్టుగా ప్రకటించారు. 2004 లో వివాహం చేసుకున్న ధనుష్-ఐశ్వర్యలు 18 సంవత్సరాల తర్వాత అంటే 2022 లో పరస్పర విభేదాల వలన విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. 

అయితే ధనుష్-ఐశ్వర్య లు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల క్రితమే విడాకుల పిటిషన్ వేసిన ఈ జంట ఇప్పటివరకు విచారణ కోసం కోర్టుకు హాజరవలేదు. ఈ నెల అంటే అక్టోబర్ 7 కి వాయిదా ఉన్నప్పటికీ ధనుష్ కానీ ఐశ్వర్య కానీ విడాకుల కోసం విచారణకు ఈ నెల 7 న కోర్టుకు హాజరవలేదు.  

దానితో విచారణను చెన్నై ఫ్యామిలీ కోర్ట్ ఈనెల 19 కి వాయిదా వేసింది. మరి విడాకులు తీసుకుని విడిపోతున్నట్టుగా ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య లు ఆ విడాకుల కోసం కోర్టుకు ఎందుకు హాజరవడం లేదు ఎందుకో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Dhanush and Aishwarya fail to appear before the court:

Dhanush and Aishwarya avoids famiy court divorce issue

Tags:   DHANUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ