Advertisementt

బిగ్ బాస్ గుట్టు విప్పేసిన సోనియా

Tue 08th Oct 2024 11:02 AM
sonia akula  బిగ్ బాస్ గుట్టు విప్పేసిన సోనియా
Sonia Akula Exposed Bigg Boss Show Dark Secrets బిగ్ బాస్ గుట్టు విప్పేసిన సోనియా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 లో నాలుగో వారంలో విపరీతమైన నెగిటివిటి మూటగట్టుకుని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల.. బయటికొచ్చాక తనపై వచ్చిన నెగిటివిటీని చూసి ఆమె ఇస్తున్న ఇంటర్వూస్ లో తన తప్పేమి లేదు, తప్పంతా బిగ్ బాస్ దే. నేను హౌస్ లో చక్కగా ఉన్నాను, కానీ నన్ను బిగ్ బాస్ చూపించిన తీరు నచ్చలేదు. 

అసలు బిగ్ బాస్ లో డ్రెస్ బాగోకపోయినా, ఎంటర్టైన్ ఇవ్వకపోయినా బిగ్ బాస్ నుంచి మెసేజెస్ వస్తాయి. కానీ అక్కడ బిగ్ బాస్ లోకి వెళ్లి నన్ను నేను ఎలా ఉన్నానో చూపించాలనుకున్నా. కానీ నన్ను నన్నుగా కాకుండా వేరేలా బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసారు. వాళ్లకు కావాల్సిన కంటెంట్ కోసం నన్ను బలి పశువును చేసారు. నేను నిఖిల్, పృథ్వీ తో చేసిన స్నేహంలో తప్పులేదు. కానీ తప్పుగా చూపించారు. 

అక్కడ 160 కెమెరాలు ఉన్నాయి. నా కాళ్ళు, చేతులు మాత్రమే చూపిస్తూ కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు. బిగ్ బాస్ అనేది కరెక్ట్ కాదు అంటూ సోనియా ఆకుల బిగ్ బాస్ రూల్స్ పక్కనపెట్టి బిగ్ బాస్ గుట్టు విప్పేసింది. బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఆహా ఓహో అనాలని కండిషన్ ఉంటాయి. సోనియా మాత్రం తాను విన్నర్ అయ్యేదాన్ని, కానీ కావాలని నన్ను డీ ఫేమ్ చేసి ఎలిమినేట్ చేసారు అంటూ బిగ్ బాస్ ను ఎడా పెడా వాయించేస్తుంది. 

Sonia Akula Exposed Bigg Boss Show Dark Secrets:

Sonia Akula sensational comments on Bigg Boss

Tags:   SONIA AKULA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ