సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా ఈ మద్యన సౌత్ కన్నా ఎక్కువగా బాలీవుడ్లో కనిపిస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ సొగసులద్దుతోంది. సాంఘీక మాధ్యమాల్లో రకరకాల ఫోటో షూట్స్ షేర్ చేస్తూ యూత్ ను కట్టి పడేస్తుంది. గ్లామర్ అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తూ హడావిడి చేస్తుంది.
తాజాగా రాశి ఖన్నా వదిలిన పిక్స్ చూస్తే రాశి ఖన్నా అందాల ఆరబోత వేరే లెవల్ అంటారేమో. కోటు, సూటు వేసి లూజ్ హెయిర్ తో రాశి ఖన్నా చేసిన గ్లామర్ రచ్చ మాములుగా లేదు. రాశి ఖన్నా అందాలు సోషల్ మీడియా కు కొత్త కాదు, కానీ ఈ రేంజ్ అందాలు మాత్రం కొత్తే. ప్రస్తుతం రాశి ఖన్నా కొత్తందాలు నెట్టింట సంచలనంగా మారాయి.
హిందీ లోకి వెళ్ళాక రాశి ఖన్నా సౌత్ కు దూరమవుతుందేమో అనుకున్నారు. కానీ రాశి ఖన్నా ఇక్కడ కూడా వరస ప్రాజెక్ట్స్ తో బిజిగానే కనిపిస్తుంది.