అక్కినేని నాగార్జున తన ఫ్యామిలీ పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన నీచమైన కామెంట్స్ విషయంలో 100 కోట్ల పరువు నష్టం దావా వేసాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. నాగార్జున తరుపున లాయర్ వాదనలు వినిపించగా.. నాంపల్లి కోర్టు నాగార్జున వాగ్మూలం ఇవ్వాలని ఆయన కోర్టుకు హాజరవ్వాలని ఆదేశాలు జారి చేసింది.
అయితే కొండా సురేఖ తరపు లాయర్ మాట్లాడుతూ తాము కూడా నాగార్జున పై కేసులు పెడతామని, ఆయన వెనుక ఉన్నవారికి కూడా వదలమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అయిపోయిన విషయంపై నాగార్జున ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో, ఆయన వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నారు.
పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడడం వలన నొచ్చుకుంటే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటాను అని కొండా సురేఖ చెప్పారు. అక్కడితో కేసు తెగిపోయింది. కానీ కావాలని డీవియేట్ చెయ్యడానికి, డైవర్ట్ పాలిటిక్స్ కోసం కేటీఆర్ అనే వ్యక్తి నాగార్జున వెనుక ఉండి కేసులు పెట్టిస్తున్నారు అని మేము అనుకుంటున్నాము, అందుకే నాగార్జున వెనుక ఉన్న వారిని వదలము, వారిపై కూడా కేసులు పెడతామంటూ కొండా సురేఖ లాయర్ చెప్పారు.