Advertisement

మంత్రుల నోటికి మహేష్ తాళం!

Mon 07th Oct 2024 06:19 PM
konda surekha  మంత్రుల నోటికి మహేష్ తాళం!
Mahesh Kumar Goud in the mouth of the ministers మంత్రుల నోటికి మహేష్ తాళం!
Advertisement

అవును.. ఇకపై మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఆచి తూచి మాట్లాడితేనే మంచిది.. లేదంటే సీన్ రివర్స్ అయినా అవ్వొచ్చు..! ఇందుకు చక్కటి ఉదాహరణే తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే..! మహిళా మంత్రి ఏ విషయంపై మీడియాతో మాట్లాడాలని వచ్చారో తెలియదు కానీ ఎటు నుంచో ఎటో వెళ్ళిపోయి అక్కినేని ఫ్యామిలీ, సమంత.. మాజీ మంత్రి కేటీఆర్ పేర్లు ప్రస్తావించి రచ్చ రచ్చే చేసేశారు. దీంతో సామాన్యుడు మొదలుకుని యావత్ సినీ ప్రపంచం సురేఖను తిట్టి పోసేసింది. ఇప్పుడీ వ్యవహారం కోర్టుల్లో నడుస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి ఘటనలు పునావృతం కాకుండా చూడాలని టీపీసీసీ చీఫ్ సీరియస్ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా రంగలోకి దిగారు.

ఇకనైనా జాగ్రత్త..!

ఇప్పటివరకూ జరిగింది ఏదో జరిగిపోయింది ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలకు సలహాలు, సూచనలు చేశారు మహేష్ గౌడ్. ఇకపై మీడియాతో ఏదైనా విషయంపై మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని మంత్రులపై టీపీసీసీ చీఫ్ సీరియస్ అయినట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖ ఘటన తర్వాత మహేష్ ప్రతిదీ మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవర్‌లో ఉన్న టైంలో మంత్రులు ఆచితూచి మాట్లాడాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలియవచ్చింది. మీడియా ముందుకు వచ్చేప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి దేనిపైన మాట్లాడాలి..? ఎంత వరకూ మాట్లాడాలి..? అనేది తెలుసుకుని రావాలని ఢిల్లీలోని అగ్ర నేతలు నుంచి టిపిసిసి చీఫ్ మహేష్, సీఎం రేవంత్ రెడ్డిలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని సమాచారం.

నోరు జారొద్దు..!

కొండా సురేఖ దెబ్బ.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో డ్యామేజి చేసిందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే.. ఇకపై మీడియా ముందుకు ఎవరు వచ్చినా సరే అచి తూచి అడుగులు వేయాలని.. ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ మాట్లాడాలని ఇప్పుడు హైకమాండ్ నుంచి మంత్రులందరికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. మరీ ముఖ్యంగా.. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎంత టెంప్ట్ చేసినా సరే నోరు జారొద్దని మంత్రులకు మహేష్ కుమార్ గౌడ్ సూచన చేశారు. వీలైతే.. మంత్రులు మీడియా ముందుకు వచ్చే ముందు పలానా విషయంపై మాట్లాడుతున్నట్టు సీఎంవోలో లేదా.. టీపీసీసీకి చెబితే ఇంకా మంచిదని కూడా మహేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. మునుపటిలా నోటికొచ్చినట్టు మాట్లాడటం ఇక అయ్యేపని కాదు.. ఇప్పుడు నోటికి తాళం పడినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ మాటల వరకేనా..? లేదా ఆచరణలో వచ్చి ఇష్టానుసారం మాట్లాడే మాటలకు అడ్డుకట్ట వేసేలా ఉంటుందా అన్నది తెలియాల్సింది మరి.

Mahesh Kumar Goud in the mouth of the ministers:

Konda Surekha blow.. Congress party has been damaged in an unexpected way

Tags:   KONDA SUREKHA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement