బిగ్ బాస్ సీజన్ 8 లోకి మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వారిలో ఆరుగురు ఐదు వారాలకు గాను ఎలిమినేట్ అయ్యారు. ఐదు వారాల తర్వాత హౌస్ లోకి గత సీజన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కనిపించిన ఎనిమిదిమందిని హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించారు. గత రాత్రి రీ లోడెడ్ అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్ హరితేజ, గంగవ్వ, గౌతమ్, అవినాష్, మెహబూబ్, టేస్టీ తేజ, నయని పావని, రోహిణులు ఉన్నారు.
ఈ వారం నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ని ఎవ్వరిని నామినేట్ చెయ్యొద్దని పాత హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ చెప్పాడు. ఓజి క్లాన్ అంటే హౌస్ లో పాతవారినే నామినేట్ చెయ్యాల్సి ఉంది. అందులో హరితేజ యష్మి, పృథ్వీ ని నామినేట్ చేసింది. నయని విష్ణు ప్రియను, సీత ను నామినేట్ చేసింది. ఈ నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ vs హౌస్ మేట్స్ అన్న రేంజ్ లో నామినేషన్స్ నడిచాయి.
ఈ వారం ఓజి క్లాన్ నుంచి విష్ణుప్రియ, కిరాక్ సీత, పృథ్వీ, యష్మీగౌడ నామినేట్ అవ్వగా.. వైల్డ్ యార్డ్ నుంచి వచ్చిన వారిలో ఇద్దరిని పాత హౌస్ మేట్స్ డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం రాగా.. అందులో మెహబూబ్, గంగవ్వ లు నామినేషన్స్ లోకి వెళ్లారు.