Advertisementt

రేపు నాంపల్లి కోర్టుకు నాగార్జున

Mon 07th Oct 2024 01:58 PM
nagarjuna  రేపు నాంపల్లి కోర్టుకు నాగార్జున
Nagarjuna to Nampally court tomorrow రేపు నాంపల్లి కోర్టుకు నాగార్జున
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో ప్రస్తుతం నాగార్జున కేసు వాదనలు జరుగుతున్నాయి. కొండా సురేఖ తన ఫ్యామిలీపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల ఫలితంగా నాగార్జున సురేఖపై కేసు పెట్టి కోర్టుకెక్కారు. 

ఈరోజు నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున కోర్టులో సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. మంగళవారం అంటే రేపు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు పేర్కొంది. దానితో రేపు నాగార్జున కోర్టుకు రావాల్సి ఉంది. 

అంతేకాకుండా నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. రేపు ఖచ్చితంగా నాగార్జున కోర్టుకు హాజరవ్వాల్సి ఉంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది మనోరంజన్ కోర్ట్.

Nagarjuna to Nampally court tomorrow:

Nagarjuna Approached Nampally Court

Tags:   NAGARJUNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ