సలార్ 2 ప్రస్తుతానికి సెట్స్ మీద కూడా లేదు, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా కోసం ఆయన రెడీ అవుతున్నారు. ప్రభాస్ కూడా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా వున్నారు. ఇరువురు సలార్ 2 ని ప్రస్తుతం పక్కనపెట్టారు. ఎన్టీఆర్ తో సినిమా పూర్తయ్యాకే ప్రభాస్ తో సలార్ 2 ఉండబోతుంది. సలార్ 1 తో పాటుగానే సలార్ 2 కి సంబంధించి చాలావరకు అంటే 60 నుంచి 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేసారు.
అందుకే పార్ట్ 2 కి కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఇంతలోపులో సలార్ 2 లీక్స్ అంటూ కొన్ని సన్నివేశాల క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సలార్ 2 లో టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్, దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అది చూసిన ప్రభాస్ అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
సలార్ పార్ట్ 1 లో హైలెట్ గా నిలిచిన కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఈ లీకైన సీక్వెన్స్ ఎంతో వైలెంట్ గా ఉంటుంది అంటూ మాట్లాడుకోవడం సలార్ 2పై అంచనాలు పెంచేలా ఉంది. మరి ప్రశాంత్ నీల్ సలార్ 2 ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారా అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.