అతి త్వరలోనే నందమూరి వారసుడు మోక్షజ్ఞ తన మొదటి మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. బాలయ్య తన వారసుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యబోతున్నారు. తాజాగా ఎన్టీఆర్ ను కూడా మీకు ఇద్దరు వారసులు, వాళ్ళను కూడా సినిమా ఇండస్ట్రీలోకి నటులుగా తీసుకొస్తారా అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ అదిరిపోయే సమాధానం చెప్పారు.
దేవర సక్సెస్ పార్టీలో ఎన్టీఆర్ తన కొడుకుల సినీరంగ ప్రవేశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అభయ్, భార్గవ్ లు ఇద్దరు ఇండస్ట్రీలోకి వచ్చేది లేనిది ఇప్పుడే చెప్పలేను, నా ఇష్టాలను, అభిరుచులను వారిపై రుద్దాలనుకోవడం లేదు. వారు ఎంతో కోరుకుని ఇష్టపడి వస్తే పర్వాలేదు. వారిని బలవంతంగా ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చే ఉద్దేశం అయితే నాకు లేదు.
నా కెరీర్ విషయంలో నా పేరెంట్స్ ఎలా అయితే వ్యవహరించారో, నా అభిప్రాయానికి ఎలా అయితే గౌరవం ఇచ్చారో నేను అదే విధంగా నా కొడుకుల అభిప్రాయాలను గౌరవిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. వారింకా చిన్న పిల్లలు. వారు పెరిగిన తర్వాత ఏం అవ్వాలనుకుంటే అది వారికి అందించేలా ప్లాన్ చేసుకుంటాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.