Advertisementt

జానీ మాస్టర్‌కు మరో కొరియోగ్రాఫర్ సపోర్ట్

Sun 06th Oct 2024 07:35 PM
aata sandeep  జానీ మాస్టర్‌కు మరో కొరియోగ్రాఫర్ సపోర్ట్
Sandeep master support Jani Master జానీ మాస్టర్‌కు మరో కొరియోగ్రాఫర్ సపోర్ట్
Advertisement
Ads by CJ

జానీ మాస్టర్ తప్పు చేశాడా.. లేదంటే అతనే కరెక్ట్, ఆ లేడీ కొరియోగ్రాఫర్ ది తప్పా అనేది కోర్టు తెలుస్తుంది. కానీ జానీ మాస్టర్ కష్టపడి సంపాదించుకున్న అవార్డును వెనక్కి తీసుకోవడం అనేది బిగ్ మిస్టేక్.. అది పర్సనల్ లైఫ్‌లో జరిగింది, కానీ ఇది అతని కెరీర్. కెరీర్‌లో డాన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకత సంపాదించుకుని కష్టపడి అవార్డు సంపాదించుకున్న జానీ మాస్టర్ పై కేసు ఉంది. 

అందుకే అతనికి రావాల్సిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు అంటూ మరో కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ రిలీజ్ చేసిన వీడియో చూస్తే అతను జానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది. జానీ మాస్టర్ దగ్గర పని చేసిన ఆ లేడీ కొరియోగ్రాఫర్ తో తాను కూడా వర్క్ చేశాను. తనని కొన్ని ఈవెంట్స్ కోసం రమ్మన్నప్పుడు నేను జానీ మాస్టర్ ఒక్కరి దగ్గరే పని చేస్తాను, మీ దగ్గరకు రాలేను అని చెప్పింది. 

జానీ మాస్టర్ దగ్గర ఇబ్బంది పడే అమ్మాయి అయితే అలా చెప్పదు. అంత కంఫర్టుబుల్‌గా కనిపించిన అమ్మాయి జానీ మాస్టర్ తో చాలా ఇబ్బందులు పడినట్లుగా చెప్పడం అనేది అర్ధం కావడం లేదు. అలాంటి అమ్మాయి ఈరోజు జానీ మాస్టర్ జీవితం నాశనం చేసేసింది అంటూ సందీప్ మాస్టర్ తన వైఫ్ జ్యోతితో కలిసి చేసిన వీడియో వైరల్ గా మారింది. 

Sandeep master support Jani Master:

Aata Sandeep on Jani Master

Tags:   AATA SANDEEP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ