కొన్ని సినిమాల్లో కనిపించి ఫేమస్ అయిన శుభశ్రీ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి అందమైన నవ్వుతో అందరిని ఆకర్షించింది. బిగ్ బాస్ 7 లో కొన్ని వారాల్లోనే ఎలిమినేట్ అయినప్పటికీ.. ఆ తర్వాత స్టార్ మా ఈవెంట్స్ లో చూడ చక్కగా కనిపించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమా అవకాశాలు అందుకుంది.
తాజాగా శుభశ్రీ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అవడం కలకలం సృష్టించింది. ఓ సినిమా షూటిగ్ కోసం కరువు ప్రయాణిస్తున్న ఆమె కారుకు నాగార్జున సాగర్ మాచర్ల వద్ద ప్రమాదం జరిగింది. దానితో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. మద్యం మత్తులో ఉన్న బైక్ రైడర్ ఎదురుగా వస్తున్న శుభశ్రీ కారుని ఢీ కొట్టడంతో శుభశ్రీ కారు డ్యామేజ్ అయ్యింది. అయితే కారులో ప్రయాణం చేస్తున్న శుభశ్రీకి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
ఆమెకే కాదు కారులో ప్రయాణిస్తున్న ఎవ్వరికి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది.