Advertisementt

అంటే ఢీ సీక్వెల్ లేనట్టేగా..

Sat 12th Oct 2024 11:08 AM
dhee sequel,sreenu vaitla  అంటే ఢీ సీక్వెల్ లేనట్టేగా..
Sreenu Vaitla About Dhee Movie Sequel అంటే ఢీ సీక్వెల్ లేనట్టేగా..
Advertisement
Ads by CJ

మంచు విష్ణు హీరోగా, రియల్ స్టార్ శ్రీహరి ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ఢీ. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఎటువంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఆ మధ్య ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రియల్ స్టార్ శ్రీహరి, నటుడు జయప్రకాశ్ రెడ్డి వంటివారి మృతితో ఈ ఢీ సీక్వెల్ ఇక ఉండదనేలా మంచు విష్ణు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడదే విషయాన్ని శ్రీను వైట్ల కూడా చెప్పుకొచ్చారు.

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం విశ్వం. ఈ సినిమా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీను వైట్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఢీ సీక్వెల్ ఎప్పుడు? అనే ప్రశ్న శ్రీను వైట్లకు ఎదురైంది. ఆయన అందుకు సింపుల్‌గా శ్రీహరిగారిని రీప్లేస్‌మెంట్ చేయడం కష్టం అంటూ.. ఢీ సీక్వెల్‌పై హోప్స్ పెట్టుకోవద్దని క్లారిటీ ఇచ్చేశారు. 

అయితే మంచు విష్ణు మాత్రం ఢీ సీక్వెల్ లేకపోయినా.. శ్రీను వైట్లతో సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం శ్రీను వైట్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అలాగే మంచు విష్ణుకి కూడా మంచి హిట్ కావాలి. ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కావాలంటే మాత్రం ప్రస్తుతం శ్రీను వైట్ల చేస్తున్న విశ్వం, మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప చిత్రాలు బ్లాక్‌బస్టర్ అవ్వాలి. అప్పుడు వీరి కాంబినేషన్ అనే కాదు.. ఢీ సీక్వెల్ ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చూద్దాం మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్‌ని రాబడతాయో..

Sreenu Vaitla About Dhee Movie Sequel:

No Sequel to Dhee Movie Says Manchu Vishnu and Sreenu Vaitla

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ