Advertisementt

కొరటాలకు రెస్ట్.. ఎన్టీఆరే చెప్పాడు

Fri 11th Oct 2024 08:39 PM
devara 2,jr ntr,koratala siva  కొరటాలకు రెస్ట్.. ఎన్టీఆరే చెప్పాడు
Jr NTR Gives Rest to Koratala Siva కొరటాలకు రెస్ట్.. ఎన్టీఆరే చెప్పాడు
Advertisement
Ads by CJ

టైటిల్ చూసి కొరటాలతో చేయాల్సిన దేవర2 విషయంలో ఎన్టీఆర్ కలగజేసుకుని.. సీక్వెల్ వద్దులే రెస్ట్ తీసుకోమని చెప్పాడేమో అని అనుకుంటారేమో.. అయినా అలా అనుకోవడానికి అసలు ఛాన్స్ లేదులే. ఎందుకంటే ఇండియన్ 2లా సినిమా ఏం కలెక్షన్స్ కొల్లగొట్టకుండా లేదుకదా. దేవరకు బీభత్సంగా కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి.. దేవర2కి ఎటువంటి స్టాప్స్ లేనట్లే. మరి రెస్ట్ ఏంటని అనుకుంటున్నారా.. ఆ విషయంలోకి వస్తే.. 

కొరటాలకు ఎన్టీఆర్ రెస్ట్ ఇచ్చాడట. ఆ విషయం స్వయంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. తన తాజా ఇంటర్వ్యూలో దేవర 2 ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకి సమాధానమిస్తూ.. దేవర మొదటి పార్ట్ చిత్రీకరణ సమయంలోనే రెండో పార్ట్‌కు సంబంధించి చాలా వరకు చిత్రీకరణ జరిపాం. దేవర మంచిగా కలెక్షన్స్ రాబట్టడం, ప్రేక్షకుల మెప్పు పొందడంతో దేవర2 విషయంలో ఇంకా బాధ్యత ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం.

దేవర పార్ట్ 2కి సంబంధించి కథ మొత్తం సిద్ధంగా ఉంది. కాకపోతే ఇప్పుడొచ్చిన రిజల్ట్ చూసి ఇంకాస్త తుది మెరుగులు దిద్దాలని శివ ఎంతో కష్టపడుతున్నాడు. అందుకే ఇప్పుడప్పుడే ఏం వద్దులే అని చెప్పి.. ఓ నెలన్నర పాటు రెస్ట్ తీసుకుని.. ఆ తర్వాత కూర్చోమని చెప్పాను. హాలిడేకి వెళ్లి ఎంజాయ్ చేసి రిఫ్రష్ అయ్యి రమ్మని చెప్పాను. హాలిడేస్ పూర్తయిన తర్వాత దేవర 2 పనులు మొదలవుతాయని తారక్ చెప్పుకొచ్చారు. 

Jr NTR Gives Rest to Koratala Siva:

Devara 2 Movie Shooting Update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ