Advertisementt

వరుణ్ తేజ్ మట్కా టీజర్ వచ్చేసింది

Thu 10th Oct 2024 01:28 PM
varun tej,matka,teaser  వరుణ్ తేజ్ మట్కా టీజర్ వచ్చేసింది
Varun Tej Matka Movie Teaser Out వరుణ్ తేజ్ మట్కా టీజర్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. తన ప్రయత్నంలో లోపం లేకపోయినా.. వైవిధ్యభరిత కథలను ఎన్నుకుంటున్నా.. వరుణ్ తేజ్‌కు మాత్రం ఈ మధ్య కాలంలో సక్సెస్ మాత్రం దరి చేరడం లేదు. ఎన్నో ఆశలతో, ఎన్నో అంచనాలతో విడుదలైన ఆయన గత కొన్ని చిత్రాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు వరుణ్ ఆశలన్నీ కూడా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మట్కా పైనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ వదిలారు. ఈ టీజర్ చూస్తుంటే.. వరుణ్ తేజ్ గత కొంతకాలంగా మిస్ అయిన సక్సెస్ అందే అవకాశాలే కనిపిస్తున్నాయి.

టీజర్ విషయానికి వస్తే.. జైలులో ఒక జైలర్ మాటల నుండి ప్రేరణ పొందిన హీరో పరివర్తనను ఈ టీజర్ హైలైట్ చేస్తుంది. ఆశయం, దురాశలపై ఉన్న అవగాహనతో నడిచే అతను ఈ క్రూరమైన ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి బయలుదేరాడు, ఇక్కడ సంపద కోసం కోరిక అతని అభివృద్ధి చెందుతున్న వ్యాపారానికి ఆజ్యం పోస్తుంది. విశాఖపట్టణం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి.. లేదా ఈ వాసు గుర్తుకు రావాలనే డైలాగ్ వరుణ్ తేజ్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తోంది. నాలుగు విభిన్నమైన మేకోవర్‌లతో వరుణ్ ఇందులో కనిపిస్తున్నాడు. ప్రతి మేకోవర్‌కి చాలా ఇంపార్టెంట్ ఉన్నట్లుగానూ, దానికి అనుగుణంగా డైలాగ్ డెలివరీకి మలుచుకున్నట్లుగా ఈ టీజర్‌లో స్పష్టమవుతోంది. 

ఓవరాల్‌గా ఈ టీజర్ చూస్తుంటే.. వరుణ్ తేజ్ నుంచి మరో వైవిధ్య భరిత చిత్రం రాబోతుందనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఇక ఇక్కడి నుండి ఈ సినిమాపై భారీగా అంచనాలు మొదలవ్వడం ఖాయం. ఈ టీజర్‌లో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి మరియు నవీన్ చంద్రతో  పాటు.. సినిమాలోని సపోర్టింగ్ తారాగణాన్ని కూడా పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు SRT ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Varun Tej Matka Movie Teaser Out:

Varun Tej Matka Teaser Revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ