Advertisementt

RC 16 రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే..

Sun 06th Oct 2024 09:18 AM
ram charan,rc 16  RC 16 రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే..
Global Star Ram Charan RC16 Shooting Update RC 16 రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి అప్పుడే రెండు నెలలపైనే అవుతుంది. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం ప్రిపేర్ అవుతున్నారు. దర్శకుడు బుచ్చి బాబు కూడా రామ్ చరణ్ RC16 కోసం అన్ని సిద్ధం చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ RC 16 సెట్స్ లోకి అడుగుపెట్టే క్షణం కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు. 

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్-బుచ్చి బాబుల కాంబో మూవీ RC 16 రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 1 నుంచి ఉండబోతుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో చరణ్-RC 16 కి హీరోయిన్ గా ఎంపికైన జాన్వీ కపూర్ లపై రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేస్తారని, మొదటి షెడ్యూల్ నవంబర్ 1 నుంచి 8 వరకు మైసూర్ లో ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి బాబు. 

మొదటి షెడ్యూల్ పూర్తయ్యి మైసూర్ నుంచి రాగానే ఇమ్మడియేట్ గా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో సెకండ్ షెడ్యూల్ కోసం కూడా బుచ్చి బాబు ఏర్పాట్లు చేసి పెట్టేశాడట. నవంబర్ 12 నుంచి మొదలు కాబోయే ఈ భారీ షెడ్యూల్ సంక్రాంతి వరకు బ్రేక్ లేకుండా ఉంటుంది అని తెలుస్తోంది. ఇది విన్న మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. 

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తుండగా.. ఏ ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.  అంతేకాదు టాప్ టెక్నీషియన్స్ RC 16 కి వర్క్ చెయ్యడంతో ఈచిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

Global Star Ram Charan RC16 Shooting Update:

Ram Charan RC16 Regular Shooting Starts Soon

Tags:   RAM CHARAN, RC 16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ