యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేశాడు. రాజమౌళితో సినిమాలు చేసిన ప్రతి ఒక్క హీరో తదుపరి సినిమా విషయంలో గండాన్ని దాటలేకపోయారు. రాజమౌళి సినిమా తర్వాత భారీ నిరాశ పరిచే సినిమాలను ప్రేక్షకులకు అందించారు. కానీ ఎన్టీఆర్ దేవర సక్సెస్‌తో రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేశాడు.
ఇప్పుడు గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ వంతు, ఏం చేస్తాడో అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరతో హిట్ కోడితే.. రామ్ చరణ్ మాత్రం రాజమౌళి గండాన్ని దాటలేకయాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్యతో బిగ్గెస్ట్ ప్లాప్ చూశాడు. ఆచార్యలో రామ్ చరణ్ ది గెస్ట్ రోల్ అని అనలేం.. చరణ్ పాత్ర నిడివి తక్కువేం లేదు.
సో రామ్ చరణ్ ఆచార్యతో గండాన్ని దాటలేకపోయినా.. గేమ్ ఛేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్‌కు బెంగ అక్కర్లేదు అంటున్నారు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాతే గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. చరణ్‌కు ఆచార్య సమయంలోనే రాజమౌళి గండం తొలిగిపోయింది అని మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.