Advertisementt

గాయత్రి మృతికి పవన్, ఎన్టీఆర్ నివాళి

Sat 05th Oct 2024 08:03 PM
rajendra prasad,gayathri  గాయత్రి మృతికి పవన్, ఎన్టీఆర్ నివాళి
Pawan Kalyan and Jr NTR Pays Tribute to Gayathri గాయత్రి మృతికి పవన్, ఎన్టీఆర్ నివాళి
Advertisement
Ads by CJ

రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మృతికి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో గాయత్రి కన్నుమూశారు. ఆమెకు తీవ్ర గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌కి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూనే ఆమె హార్ట్ ఎటాక్‌కు గురై కన్నుమూశారు. గాయత్రి మరణ వార్త తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. - పవన్ కళ్యాణ్

నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - జూ ఎన్టీఆర్

Pawan Kalyan and Jr NTR Pays Tribute to Gayathri:

Rajendra Prasad Daughter Gayathri Passes Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ