Advertisementt

నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి

Sat 05th Oct 2024 05:03 PM
rajendra prasad,daughter,gayatri  నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి
Rajendra Prasad Daughter Gayatri No More నటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మృతి
Advertisement
Ads by CJ

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం చోటుచేసుకుంది. నటకిరీటీ రాజేంద్రప్రసాద్ కుమార్తె అయిన గాయత్రి (38) గుండెపోటుతో చనిపోయారు. గత రాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన గాయత్రి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గాయత్రి మృతిని తట్టుకోలేక రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

శుక్రవారం గ్యాస్ట్రిక్ సమస్యతో గాయత్రి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో.. వెంటనే ఆమెని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. అయితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆమెకు తీవ్రమైన హార్ట్ ఎటాక్‌కు వచ్చినట్లుగా తెలుస్తుంది. డాక్టర్స్ ఎంతగా శ్రమించినా.. పరిస్థితి చేయిదాటి పోవటంతో గాయత్రి కన్నుమూశారు. ఆదివారం గాయత్రి అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించారు.

Rajendra Prasad Daughter Gayatri No More:

Actor Rajendra Prasad Daughter Gayatri Passes Away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ