Advertisementt

బిగ్ బాస్: కంటెంట్ కోసం బకరాను చేసారు

Fri 04th Oct 2024 08:40 PM
sonia akula  బిగ్ బాస్: కంటెంట్ కోసం బకరాను చేసారు
Sonia sensational comments on Bigg Boss బిగ్ బాస్: కంటెంట్ కోసం బకరాను చేసారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ పై గత వారం ఎలిమినేట్ అయిన సోనియా హాట్ కామెంట్స్ కాదు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది. బిగ్ బాస్ కంటెంట్ కోసం నన్ను బకరాను చేసారు అంటూ సోనియా బిగ్ బాస్ పై అలిగేషన్ చేస్తుంది. ఆమె నిఖిల్, పృథ్వీ లకు ఇచ్చిన  హగ్గులలో తప్పు లేదు. అంతకుముందు జరిగిన కన్వర్జేషన్ ను చూపించకుండా కంటెంట్ కోసం ఇష్టం వచ్చిన క్లిప్స్ టెలికాస్ట్ చేసారు అంటూ సోనియా బిగ్ బాస్ పై ఫైర్ అవుతుంది. 

తనని బిగ్ బాస్ కావాలనే బ్లేమ్ చేసాడు. నేను 30 ఏళ్లుగా నా లైఫ్ లో నేను నా పరువును కాపాడుకున్నాను, కానీ తన కంటెంట్ కోసం బిగ్ బాస్ ఈరోజు రోడ్డు మీద పడేసాడు. నేను టాప్ 5 లో ఉండాల్సిన పర్సనాలిటీని, బిగ్ బాస్ ప్రేక్షకులకే కాదు హౌస్ లో నాకే బోర్ కొట్టింది. మా మధ్యన ఫన్నీ టాస్క్ లు, అలాగే ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నా అవి చూపించలేదు. 

బిగ్ బాస్ అనేది నాగ్ సర్ చెప్పినట్టుగా లైఫ్ టైం షో కాదు, నేను అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. నిఖిల్ డిప్రెషన్ లో ఉన్నాడు. కాబట్టి స్నేహం చేశా, మేము ఇచ్చుకునే హగ్గులు, ముద్దులు అందులో తప్పేమి లేదు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. మేము ఫ్రెండ్స్ అనుకోవచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్స్ అనుకోవచ్చు కానీ.. బిగ్ బాస్ తనకు కావల్సినట్టుగా పోట్రె చేసాడు. 

నేను బిగ్ బాస్ కి మళ్ళీ వైల్డ్ కార్డు అవకాశం వచ్చినా వెళ్ళను అంటూ సోనియా బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. 

Sonia sensational comments on Bigg Boss:

Sonia Akula Sensational Comments On Bigg Boss 8

Tags:   SONIA AKULA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ