తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై నాగ్ ఫ్యామిలీ మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలామంది ఫైర్ అయ్యారు. సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
నాగార్జున ఏకంగా కొండా సురేఖ పై లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం రియాక్ట్ అయ్యారు. అఖిల్ అక్కినేని తన తల్లి అమల చేసిన పోస్ట్ నే రీ పోస్ట్ చేసాడు. తాజాగా అఖిల్ మరోమారు కొండా సురేఖపై సెన్సేషనల్ పోస్ట్ పెట్టాడు.
కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలి కానీ ఆమె మాత్రం తన నైతికత మరియు సామాజిక సంక్షేమాన్ని మరచిపోయింది. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వలన మా ఫ్యామిలీ మెంబెర్స్, ప్రజలు గాయపడ్డారు మరియు అగౌరవంగా మిగిలిపోయారు.
ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు మరియు సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి.. మన సమాజంలో మన్నన లేదు. ఇది క్షమించరాని నేరం, సహించదు అంటూ అఖిల్ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ పై భగ్గుమన్నాడు.