మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ గర్ల్ శ్రీలీల మళ్ళీ బిజీ కాబోతుంది. వరస సినిమాలతో కళకళలాడడమే కాదు.. షాప్ ఓపినింగ్స్ తో సందడి చేస్తుంది. రీసెంట్ గా మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పట్టు చీరతో కనిపించి కనువిందు చేసిన శ్రీలీల తాజాగా మోడరన్ అవుట్ ఫిట్ లో అద్దరగొట్టేసింది.
ఫ్లవర్స్ ఫ్రాక్ లో శ్రీలీల క్యూట్ గా సిగ్గుపడుతుంటే యూత్ కి మైకం రావడం అయితే ఖాయం. బ్లాక్ ఫ్రాక్ పై వైట్ ఫ్లవర్స్ తో శ్రీలీల అవుట్ ఫిట్ ఎంత బాగుందో.. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతకన్నా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అందానికి అందం అంతే ఆకర్షణగా ఉన్న శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి.
ప్రస్తుతం నితిన్ తో చేస్తున్న రాబిన్ హుడ్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్న శ్రీలీల.. రవితేజ కోలుకోగానే RT 75 సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. మరోపక్క కోలీవుడ్, హిందీ చిత్రాలు కూడా శ్రీలీల ను బిజీగా కాదు కాదు క్రేజీ హీరోయిన్ గా మార్చబోతున్నాయి.