N కన్వెన్షన్ ను కూల్చకుండా పదేళ్లుగా హై కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కాపాడుకుంటున్న అక్కినేని నాగార్జున.. దానిని కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పేరుతొ కాల్చివెయ్యడం అనేది బిగ్ షాక్ నిచ్చింది. తమకు నోటీసులు ఇవ్వకుండా N కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కోర్టుకి వెళ్లి స్టే తెచ్చారు. అప్పటికే కూల్చివేతలు పూర్తయిపోయాయి. అప్పటినుంచి రేవంత్ సర్కార్ పై నాగార్జున మంట మీదున్నారు.
ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ పదవిలో ఉన్న కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన నీచమైన వ్యాఖ్యల ఫలితం ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేఖత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. నాగ్ ఫ్యామిలోని ప్రతిఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. నాగార్జున అయితే మాములుగా ఫైర్ అవ్వలేదు.
నాగార్జున నాంపల్లి కోర్టులో కొండా సురేఖ పై క్రిమినల్ & డిఫర్మేషన్ కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అసలే N కన్వెన్షన్ కూల్చివేతలో మంట మీదున్న నాగార్జున ఈసారి రేవంత్ ప్రభుత్వాన్ని రోడ్డు కి ఈడ్చేవరకు ఊరుకునేలా లేరు. మరి కొండా సురేఖ పై నాగ్ లీగల్ గా ప్రొసీడ్ అవడం పట్ల కొండా సురేఖ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.